బరువు తగ్గాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్… ఓ బెస్ట్ చిట్కా మీకోసమే !
ప్రస్తుత కాలంలో మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువున్న వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడాలని వ్యాయామాలను, చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యువకుల నుంచి పెద్దల వరకు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. పడకగదిలో ఓ గంట సేపు ఎక్స్ ట్రాగా నిద్రపోతే చాలు ఈజీగా బరువు తగ్గుతారని యూనివర్సిటీ ఒఫఆఫ్ చికాగో సైంటిస్టులు కనుగొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం బరువు తగ్గాలనుకునే వారు రాత్రి సమయంలో ఓ గంట ఎక్కువ సేపు పడుకుంటే చాలని చెబుతున్నారు. ఇది నూటికి నూరుపాళ్లూ నిజమని ఈ అధ్యయనం పేర్కొంటోంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు రాత్రి సమయం ఓ గంట పాటు ఎక్స్ ట్రా గా పడుకోవడం వల్ల వారు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా పడుకునే కొంతమంది ఒక్క రోజుకు 270 కేలరీల ఆహారాన్ని తగ్గించారట. ఇకపోతే మరికొంతమందేమో ఇలా పడుకోవడం వల్ల రోజుకు 500 కేలరీల ఆహారాన్నితీసుకోవడం తగ్గించారని అధ్యయనం పేర్కొంటోంది.
కాగా ఇలా నిద్రపోయి రోజుకు 270 క్యాలరీల ఆహారాన్ని తగ్గించేవారు.. మూడేండ్లలో దాదాపుగా 13 కిలోల బరువును ఇట్టే కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్ర తగ్గిస్తే మాత్రం ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. కాగా తాజా అధ్యయనం ప్రకారం.. నిద్రపోయే సమయాన్ని ఓ గంట పెంచితే తక్కువగా తినే అవకాశముందని తేల్చి చెప్పింది. అందుకే నిద్రపోయే సమయాన్ని గంటపాటు పెంచండి. అప్పుడే మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది.