మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా… అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే?
కొన్ని విషయాలను వాయిదా వేయడం వల్ల మనం ఎన్నో అనార్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాటిలో మూత్రం కూడా ఒకటి. ఇలా చేయడం వల్ల సమస్యలను తప్పక ఫేస్ చేయాల్సి వస్తదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ చాలా మంది దీనిని కూడా ఆపుకుంటున్నారు. ఈ మూత్రం మన శరీరంలో ఉన్న మలినాలన్నింటిని బటయకు పంపే ద్రవ పదార్థం. ఎప్పటికప్పుడు ఈ మలినాలను బయటకు పంపకపోతే అస్సలు మంచి పద్దతి కానే కాదు. ఇలాచేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో మీకోసం…
సాధారణంగా మన మూత్రాశయంలో 400 నుంచి 600 మిల్లీ లీటర్ల వరకు మూత్రం ఉండగలదు. ఈ పరిమితి దాటితే మూత్రాశయం ఒత్తిడి పెరగడం మొదలవుతుంది. అంతేకాదు ఆ మూత్రాన్ని విసర్జించకుండా అలాగే ఆపుకుంటూ పోతే మూత్రాశయ పరిమాణం ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఇలా పెరగడం వల్ల దీని నుంచి మెదడుకి సంకేతాలు తక్కువ మొత్తంలోనే అందుతాయి. ఈ కారణంగా మూత్రం విసర్జన చేసే సమయం మించిపోవచ్చు. అలా ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపడం వల్ల మన శరీరంలో ఎక్కువ మలినాలు ఉంటాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల యూరిన్ లోని కొన్ని రకాల పదార్థాలు జిగటగా మారే అవకాశం ఉంటుంది. ఆ జిగట చిన్న చిన్న రాళ్లుగా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎంత ఎక్కువ సేపు మూత్రాన్నిఆపి ఉంచితే రాళ్లు కూడా అంతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే యూరిన్ ను వాయిదా వేయడం వల్ల కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని వైద్యలు తేల్చి చెబుతున్నారు. కాగా ఇలా మూత్రం ఆపి ఉంచడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.