హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ టిప్స్ మీకోసమే !
ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్య అందర్నీ తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా ఈ సమస్య యువతను ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యతో వారు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి తీమ్రమైన ఒత్తిడి గురై.. ఇంకా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా మీజుట్టును క్షేమంగా కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మసాజ్: జుట్టు సంరక్షణ చర్యలలో మసాజ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తరచుగా జుట్టును మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా జుట్టును మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, అలసట క్షణాల్లో మటుమాయం అవుతాయి.
కలబంద : కలబంద ఎన్నో ఔషద గుణాల గని అని మనందరికీ తెలిసిందే. ఈ అలొవెరా తో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఇది హెయిర్ కు మంచి కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కలబంద కండీషనర్లు, షాంపు వాడినా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరి నూనె: ప్రస్తుత కాలంలో కొబ్బరి నూనె పెట్టేవారు చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ ఇందులో ఫ్యాటీ యాసిడ్లు మెండుగా లభిస్తాయి. ఇవి హెయిర్ లోనికి వెళ్లి వాటికున్న ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తుంది. అయితే నైట్ టైం హెయిర్ కు నూనెను పెట్టుకుని ఉదయం హెడ్ బాత్ చేస్తే కూడా జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె పెట్టడం వల్ల కేశాలు ఆరోగ్యంగా , అందంగా ఉంటాయి.
నిమ్మనూనె: నిమ్మకాయ కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు దీనివల్ల మీ కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం మీరేం చేయాలంటే.. ఫ్రెష్ నిమ్మకాయను తీసుకుని దాని నుంచి రసాన్ని తీసి వెంట్రుకలకు అప్లై చేయాలి.