రాన్ ఆఫ్ కచ్ లో ఫ్లెమింగో పక్షుల గూళ్లు.. వైరల్ వీడియో!

సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కడెక్కడో జరుగుతున్న వింతలు, విశేషాలు అందరికీ క్షణాల్లో తెలిసిపోతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా తెలియని రహస్యాలు కూడా బాగా తెలిసిపోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్లెమింగో పక్షుల గూళ్ళు. ఫ్లెమింగో పక్షులు అంటే పెద్ద కొంగలు. ఇవి పెద్దగా ఉండటం వల్ల చెట్లపై గూళ్లు కట్టుకోలేక పోతాయి. దాంతో ఇవి భూమిపైనే గూళ్ళను ఏర్పరచుకొని అందులోనే నివాసం ఉంటాయి. గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ లో ఈ పక్షులు భూమి మీద ఇసుకతో గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టాయి.

దీనికి సంబంధించిన వీడియోను డ్రోన్ ద్వారా తీయగా ఆ వీడియోను జర్నలిస్టు జానక్ దేవ్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. చలికాలంలో వేల పక్షులు ఇక్కడికి వస్తాయని.. గుడ్లు పెడతాయని.. ఆ సమయంలో తీసే ఫోటోలు బాగుంటాయని.. ఈ మొత్తం ప్రాంతాన్ని గుడ్కర్ నేషనల్ పార్క్ అంటారని వీడియో ద్వారా తెలిపారు.

ఇక ఆ వీడియోను చూసినట్లయితే.. అందులో ప్రతి గూడు పైన ఒక గుడ్డు ఉంది. అవి చూడటానికి అచ్చం చీమల పుట్టలా కనిపిస్తున్నాయి. ఇక ఆ గూళ్ళు అని ఒకేసారి చూడటంతో అద్భుతంగా అనిపించింది. కాస్త ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారటంతో క్షణాల్లో ఎంతోమంది ఈ వీడియోను వీక్షించారు. అంతేకాకుండా కామెంట్ కూడా పెడుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *