ఒకే గదిలో ఇరుక్కుపోయిన చిరుత,కుక్క.!
చిరుత పులి అంటే భయ. పడిని వారంటూ ఎవరూ ఉండరు. వెంటాడి, వేటాడి మరీ చంపుతుంది. అందులోనూ అది ఆకలి మీద ఉంటే ఇంకేముంది? కనిపించిన ప్రతీ దానిని నోట్లో వేసుకుని చంపి తినేస్తుంది. అయితే ఓ చిరుత మాత్రం తనకు ఎంత ఆకలిగా ఉన్నా సరే కామ్ గా ఉండింది. ఎదురుగా తనకు కావాల్సిన ఆహారాన్ని పెట్టుకుని కూడా దాని జోలికి కూడా పోకుండా ఉండిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?

కర్ణాటకలో ఓ చిరుత పులి ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చింది. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. వీధుల్లో తిరుగుతుండడం చూసిన వారు గజ గజ వణికారు. అయితే ప్రజలు ఎంత భయపడ్డారో అదే రేంజ్ లో చిరుత కూడా భయపడింది. అందుకే ఓ ఇంట్లోని టాయిలెట్ రూంలో దూరింది. అయితే చిరుత టాయిలెట్ రూంలో దూరేందుకు మునుపే ఓ కుక్క కూడా అక్కడ ఉన్నది. కానీ కుక్కను చూసిన ఆ చిరుత ఏం చేయకుండా కామ్ గా ఉండి పోయింది. అలా అని కనీసం కుక్క కూడా ఆ చిరుతపై నోరేసుకుని భౌ.. భౌ.. అని అరవలేదు. మంచి అండర్ స్డాండింగ్ తో ఆ టాయిలెట్ లోనే ఉండిపోయాయి.
Every dog has a day. Imagine this dog got stuck in a toilet with a leopard for hours. And got out alive. It happens only in India. Via @prajwalmanipal pic.twitter.com/uWf1iIrlGZ
— Parveen Kaswan (@ParveenKaswan) February 3, 2021
అయితే చిరుత విషయం గురించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు ముందుగా కుక్కను రక్షించారు. అనంతరం ఓ చిరుతను బంధించి అడవిలో వదిలి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.