అటుకులు తింటున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి!
Poha: చిన్నప్పటి నుంచి అనేక ఆహార పదార్థాలలో ఇష్టంగా తీసుకునే వాటిలో అటుకులు కూడా ఒకటి. వీటిని వరి ధాన్యాన్ని నానబెట్టి వేయిస్తారు. తర్వాత రోట్లో వేసి రోకలితో దంచుతారు. వీటితో రకరకాల రుచులతో రకరకాల పదార్థాలు చేస్తుంటారు. ఇక వీటిని తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయట. ఇంతకు అవేంటో ఒసారి తెలుసుకుందాం.
నిజానికి ఈ అటుకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్య తో బాధపడేవారు ఈ అటుకులను తరచూ తినడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అటుకుల లో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను ఎదుర్కోవడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇక అటుకులలో ఉండే నాలుగు రకాల విటమిన్లు ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి. తక్షణ శక్తి కావాలనుకునేవారు ఈ అటుకులను నానబెట్టి తీసుకుంటే వారికి ఇది మంచి బూస్టర్ ల పనిచేస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ అటుకులు మంచి చిట్కాలా పనిచేస్తాయి.
అటుకులలో ఎక్కువగా ఉండే పైబర్ ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ జీర్ణ సమస్యల ను కూడా చాలా వరకు దూరం పెడుతుంది. ఇక ఈ అటుకులలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉన్న వైరస్ ని తరిమి కొట్టడం లో కొంతవరకు సహాయపడుతుంది.