చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?
చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువగా ఏదైనా ఎఫెక్ట్ కొట్టి, అయినా మరోసారి ప్రయత్నాలు చేసే దానికి పోలిక కోసం ఈ సామెత ఉపయోగిస్తారు. పల్లెటూరుల్లో చింతాకు పచ్చడి, చింతకాయలతో చింతతొక్కు పచ్చడి ఎక్కువగా చేసుకుంటారు. ఈ చింతాక పచ్చడి, నెయ్యి కాంబినేషన్ తో తింటే ఇక లొట్టలేసుకుని తింటారు పాతకాలపు అలవాటు ఉన్నారు. కానీ చింత చిగరు వళ్ల ఉపయోగాలు పెద్దగా ఎవరికీ తెలియవు. దీన్ని తింటే శరీరంలోని చెడు కొలస్ట్రాల్ కు చెక్ పెట్టవచ్చిన చెప్తున్నారు వైద్యులు. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. ఫినాల్స్, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా పని చేస్తుంది. చింత చిగురులో విటమిన్ సి ఉంటుంది., యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో బాగం చేసుకేంటే మంచి ఫలితం ఉంటుంది. అల్పాహారాలు ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. కంటి సమస్య బాధలను కూడా చింతచిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.