కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

సమ్మర్ వచ్చిందంటే అధికంగా తాగేపానియాలల్లో కొబ్బరి నీళ్లు ఒకటి. అంతేకాదు ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది. కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి. కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు. రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు.

అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి. కండరాల తిమ్మిరిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య అనేది ఉండదు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *