ఉదయాన్నే కొబ్బరి నూనె తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసా..!

సాధారణంగా కొబ్బరి నూనెను కేశ సంర‌క్ష‌ణ‌లో, సౌంద‌ర్య సాధనలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్యానికి కూడా కొబ్బ‌రి నూనె ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలు వంట‌ల‌కు కొబ్బ‌రి నూనెనే ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిసిన విషయమే. కొబ్బ‌రి నూనెలో ఉండే కాల్షియం, ఐర‌న్‌, జిండ్‌, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో కొబ్బ‌రి నూనెను తాగితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసా… అవేంటో మీకోసం…

ఉద‌యాన్నే కొబ్బ‌రి నూనె తీసుకోవ‌డం వ‌ల్ల ముడతలు, పగుళ్లు త‌గ్గి చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ మృదువుగా, య‌వ్వ‌నంగా ఉంటుంది.ఇక కొబ్బ‌రి నూనెను తాగ‌డం వ‌ల్ల జుట్టు కూడా ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేయ‌డంలో కొబ్బ‌రి నూనె స‌హాయ‌ ప‌డుతుంది. మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు ప‌ర‌గ‌డుపున ఖాళీ క‌డుపుతో ఒక స్పూన్ కొబ్బ‌రి నూనెను తీసుకుంటే .

బ‌రువు త‌గ్గించ‌డంలోనూ కొబ్బ‌రి నూనె ఉప‌యోగ‌పడుతుంది. ఉద‌యాన్నే ఒక‌టి, రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె తాగితే శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.

కొబ్బ‌రి నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కూడా పెరుగుతుంది. అలాగే ఖాళీ క‌డుపుతో కొబ్బ‌రి నూనె తీసుకుంటే, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. త‌ద్వారా గుండె పోటు మ‌రియు గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఈ మ‌ధ్య కాలంలో కిడ్నీ స్టోన్స్ ఎంద‌రినో వేధిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌తి రోజు ప‌ర‌గ‌డుపున కొబ్బ‌రి నూనె తీసుకుంటే… మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *