చంద్రబాబు, పవన్ కలిసే వెళ్తారనుకుంటున్నా : ఉండవల్లి అరుణ్ కుమార్
రాష్ట్రంలో కమ్మ , రెడ్డి అనే డివిజన్ 2014 నుండి బాగా వచ్చిందని, గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్, ఇప్పుడు రెడ్డి డామినేషన్ నడుస్తోందని మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో ముసుగు ఉండేది.. ఇప్పుడు ఆ ముసుగు తీసేశారని వివరించారు.‘ ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టా రాజ్యంగా మారుతుంది. అధికారం కన్నా పది శాతం ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మండి. ఇమేజ్ ఉండి, ప్రశ్నిస్తా అని ముందుకి వచ్చే వాళ్లని ప్రోత్సహించండి. నేను చాలా అంశాలు చెప్పినా .. మీడియా ఫోకస్ చేయలేదు. పూర్తి పారదర్శక పాలన కోసం ఆన్ లైన్ లొ అన్ని అంశాలు ఉంచాలి.
ప్రజాస్వామ్యం వ్యవస్థ కి అర్ధమే నేడు మారిపోతుంది. పవన్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తి కాదని నా అభిప్రాయం. బిజెపి నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారు అవుతాయి. ఎపిలో ఎవరు నెగ్గినా 25ఎంపిలు బిజెపివే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నా. బిజెపి కాదంటే… పవన్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రం లో త్రిముఖ పోటి కాదు.. ద్విముఖ పోటీ ఉంటుంది. అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితి ని బట్టి చెబుతున్నా. ఎమ్మెల్సీ అనంత్ బాబు ది తప్పని తేలితే శిక్షిస్తారు.
అతనే చంపాడని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఈడి కేసులలో పెద్ద శిక్షలు పడటం నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డి కి అయినా జరిమానాలే పడతాయి. ఈడి కేసులు వినడం ప్రారంభమైతే శిక్ష ఖరారు అవుతుంది. ఈ కేసులు వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కు వచ్చిన నష్టం లేదు. తెలంగాణ లో షర్మిల పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదు’ అని అభిప్రాయపడ్డారు.