టమోటా ఉపయోగించి చర్మాన్ని మెరిసేలా చేయొచ్చని తెలుసా…
నిత్యం మన ఇంట్లో ఉండే టమోటా లతో అందమైన చర్మాన్ని పొందవచ్చు అని మీకు తెలుసా. నిత్యం మనం కూరలలో టమాటాను ఉపయోగిస్తూ ఉంటాం. టమాటా లో విటమిన్ ఎ, సి మరియు కె అధికంగా ఉంటాయి. అందుకే టమోటా లను చాలా బ్యూటీ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. టమోటాలో ఉండే ఎసిడిటీ మొటిమలను తొలగించి ఆరోగ్యకరమైన కణాలను కలుషితం చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. టమాటాని ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మాన్ని మృదువుగా అందంగా ఉంటుంది. టమాటాలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి మరి.
టమాటా ను ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించవచ్చు. టమాటాను మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు ఉంచుకుని చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మెరుస్తూ తాజాగా కనిపిస్తారు. మన ముఖం మీద ఉండే బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి కూడా టమాట చక్కగా ఉపయోగపడుతుంది. టమాటాను ముక్కలుగా కట్ చేసి కాస్త చక్కెర వేసి బ్లాక్ హెడ్స్ పై మెత్తగా మర్దన చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ అనేవి పోవడం జరుగుతుంది. ఇలా వారానికి రెండు మూడు రోజులైనా చూస్తూ ఉంటే మంచి ఫలితం దక్కుతుంది. శీతాకాలంలో అధికంగా చర్మం పొడిబారి పోతుంది.
ఆ సమస్యను తగ్గించుకోవడానికి టమాట చక్కగా ఉపయోగించుకోవచ్చు. రోజూ స్నానం చేసే ముందు ఒక టమాటా మిశ్రమాన్ని ఫేస్ అప్లై చేసుకొని స్నానం చేస్తే ముఖం పొడిబారడం, ముడతలు పడడం వంటి సమస్యలు దూరం చేసుకోవచ్చు. రోజు టమాటా, క్యారెట్, బీట్ రూట్ ఈ మూడింటిని కలిపి జ్యూస్ రూపంలో తాగితే బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండా అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.