తమన్ పొట్ట పై ముద్దు పెట్టిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయవంతం కావడంతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇలా చాలా సంవత్సరాల తర్వాత అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో అటు బాలయ్య అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఆహాలో ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు తెలియజేశారు.
ఈ క్రమంలోనే అఖండ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అఖండ చిత్రబృందం బాలకృష్ణ టాక్ షో లో సందడి చేశారు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, ఈ కార్యక్రమానికి హాజరయి ఎన్నో సినిమా విశేషాలను పంచుకున్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించారు.
ఇదిలా ఉండగా తమన్ వేదికపైకి రాగానే బాలకృష్ణ హై ఎనర్జీ లెవెల్స్ తో సందడి చేయడమే కాకుండా ఏకంగా తన పొట్ట పై ముద్దు పెట్టుకున్నారు. ఇలా బాలకృష్ణ తన పొట్ట పై ముద్దు పెట్టగానే అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ ఇలా తన పొట్ట పై ముద్దు పెట్టడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా తెలిపారు. అఖండ సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి తమన్ అందించిన సంగీతం కూడా కారణం కావడంతో తమన్ పొట్ట పై బాలకృష్ణ ముద్దు పెట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.