సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే ఏపీలో ఇంతశాతం షూటింగ్ జరగాల్సిందే..!

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. సినిమా టికెట్లు ఎంతుండాలనే దానిపై  జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా థియేటర్లను ప్రభుత్వం నాలుగు భాగాలుగా విభజించింది. చిన్నసినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ తీయాలన్న నిబంధనను పెట్టింది. ఒక్కో థియేటర్‌లో రెండు రకాల టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కనీస టికెట్ ధర రూ.20 నుంచి గరిష్టంగా రూ. 250 వరకు ఉంచింది. ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశించింది.

కొత్తగా విడుదల చేసిన జీవో ప్రకారం  కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100గా ఉండేలా చేసింది. నాన్ ఏసీలో రూ.40, రూ. 60గా నిర్ణయించింది. కార్పొరేషన్ స్పెషల్ రూ. 100, రూ.125గా నిర్ణయించింది. కార్పొరేషన్ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర రూ.150, రూ.250 గా నిర్ణయించింది. మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీలో రూ.30, రూ.50లుగా ఉండేలా ప్రకటించింది. మున్సిపాలిటీల్లోని స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ. 100గా నిర్ధారించింది. మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ ల్లో రూ.125, రూ.250గా, నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70గా, నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో రూ.20 నుంచి రూ. 40 వరకు ఉంటాయి.

నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90, మల్టిపెక్స్ ల్లో టికెట్ ధర రూ.100 నుంచి రూ. 250 వరకు నిర్ణయించింది. వందకోట్ల బడ్జెట్ దాటిని సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. కనీసం పది రోజుల పాటు రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించింది. సినీ పెద్దలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సినీ పరిశ్రమలో సమస్యలపై గతంలో సీఎంతో చర్చించిన సంగతి తెలిసిందే. వారి అభ్యర్థనతో సీఎం జగన్ ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై కొత్త జీవో జారీ చేస్తామని తెలిపారు.దీనిపై సినీ పెద్దలు ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూడాలి.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *