అదరగొట్టిన అనుపమ.. ఆసక్తిగా ‘బటర్ ఫ్లై’ టీజర్..!

అనుపమా పరమేశ్వరన్ వరుస గ్లామరస్‌ రోల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. అనుపమ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. ఫిబ్రవరి 18న అనుసమ బర్త్ డే సందర్భంగా ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

https://www.instagram.com/p/CaoVrvYJouV/?utm_source=ig_embed&ig_rid=fb452fcb-d333-4b52-a0df-35fbf20bed2b

‘‘మీ కళ్లను నమ్మకండి. మీ మైండ్‌ని నమ్మకండి. మరి ఏం నమ్మాలి?’’అంటూ సాగే ఈ టీజర్‌లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసేలా ఉంది. ప్రతి సీన్‌లో అనుపమ నటన అదరగొట్టేసేలా సాగింది. టీజర్‌ బట్టి చూస్తుంటే ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వలే ఇది రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు అర్విజ్, గిడియన్ కట్టా సంగీతం మరింత ప్లస్ అయ్యింది. 40 సెకండ్ల పాటు ఉన్న టీజర్ ఆసాంతం ఉత్కంఠ భరితంగా సాగింది.

జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. భూమిక మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన రౌడీ బాయ్స్ తర్వాత అనుపమ నటిస్తున్న చిత్రం ఇదే కావటంతో ఆమె ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే అనుపమ తెలుగులో నిఖిల్‌కి జంటగా ’18 పేజెస్’ మూవీ చేస్తుంది. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. అలాగే నిఖిల్ మరొక చిత్రం కార్తికేయ 2లోనూ అనుపమ నటిస్తున్నట్లు సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *