పుష్ప-2లో ఐటం సాంగ్‌ చేయబోయే బ్యూటీ ఎవరు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాంతీయ చిత్రంగా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డుల మోత మోగించింది. ఊ హించని స్థాయిలో వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ ఉత్తరాదిలో ఈ సినిమా సాధించిన వసూళ్లు బాలీవుడ్ వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Allu arjun pushpa 2 movie updates

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా విమర్శలు మన్ననలు పొందింది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించిన సుక్కు.. ప్రస్తుతం పార్ట్‌-2ని సిద్ధం చేసేపనిలో పడ్డాడు. పుష్ప పార్ట్‌-1 ఎఫెక్ట్‌తో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో పార్ట్ 2 వుండాలని దర్శకుడు సుకుమార్ కసరత్తులు చేస్తున్నాడు. బాలీవుడ్‌లో ఎలాంటి ప్రచారం చేయకపోయినా.. ఈ మూవీ అక్కడ 100 కోట్లకు మించి వసూళ్లని కాబట్టింది. దీంతో ఉత్తరాది ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకని సుకుమార్ పార్ట్ 2 `పుష్ప ది రూల్` లో భారీ మార్పులు చేయడం మొదలు పెట్టారట. అంతే కాకుండా బాలీవుడ్ బాధ్యతల్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి అప్పగించారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో తొలిసారి సమంత `ఊ అంటావా మావ ఊహూ అంటావా..` అంటూ ఐటమ్ సాంగ్ లో కేక పెట్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సమంత సాంగ్‌ కూడా హైలెట్‌గా నిలిచింది.

Allu arjun pushpa 2 movie updates

అయితే `పుష్ప ది రూల్`కి వచ్చే సరికి ఈ తరహాలో సినిమాకు జోష్ ని అందించే మరో పాటకి కూడా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాపై అంచనాలు పెరిగిపోవడంతో ఆ స్థాయిలో క్రేజ్ వున్న బాలీవుడ్ నటిని ఈ పాట కోసం తీసుకునే ఆలోచనలో టీమ్ వుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో `ఊ అంటావా.. `పాట కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిషా పటానిని తీసుకుంటారని ప్రచారం జరిగింది. మరి ఈ సారి అయినా ఆమెని ట్రై చేసి పార్ట్ 2ని మేకర్స్ మరింత హీటెక్కించేస్తారో చూడాలి. అటు ప్రముఖ మోడల్‌, నటి ఊర్వశి రౌటేలాని తీసుకుంటారానే ప్రచారం కూడా సాగుతుంది. మరి పుష్ప-2లో అల్లుఅర్జున్‌తో స్పెప్పులేసే సుందరి ఎవరో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *