పుట్ట గొడుగులు తింటున్నారా… అయితే వాళ్లకి మంచిదట…
సాధారణంగా చిన్న వారి దగ్గర నుండి పెద్ద వారు సైతం పుట్టగొడుగులు తినడానికి అంత మక్కువ చూపరు.అయితే ప్రస్తుత కాలంలో పుట్టగొడుగుల పెంపకం అనేది అధికమవడంతో సహజమైన పుట్టగొడుగు దొరకడం చాలా అరుదు.సహజమైన పుట్టగొడుగులు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోండి మరి.
మార్కెట్లో దొరికే పుట్టగొడుగుల కంటే కూడా సహజంగా దొరికే పుట్టగొడుగులో యాంటీఆక్సిడెంట్స్ విటమిన్స్ , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగుల్లో కొవ్వు పరిమాణాలు అతి తక్కువ ఉంటాయి అవి గుండె సమస్యతో బాధపడేవారికి పుట్టగొడుగులు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి పుట్టగొడుగులు లో లభించే ఇన్సులిన్ మంచి సంజీవనిలా ఉపయోగపడుతుంది. అధిక బరువు ,మలబద్ధకం జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి పుట్టగొడుగులు మంచి ఔషధంగా కూడా చెప్పుకోవచ్చు. చర్మ సంబంధిత వ్యాధులు కూడా పరిష్కరించుకోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే పుట్టగొడుగుల కన్నా కూడా వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగులో యాంటీఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.
అయితే చాలామంది పుట్టగొడుగులు తినడానికిత్వరగా ఇష్టపడరు . పుట్టగొడుగులు లో ఉండే దివ్య ఔషధాలు తెలుసుకుంటే పుట్టగొడుగులను అస్సలు వదిలిపెట్టరు. మారుతున్న కాలం అనుసారంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్న ప్రస్తుతకాలంలో రసాయనాలు లేని సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడం వలన మన శరీరం ఎటువంటి వ్యాధులు సైతం పోరాడడానికి తగినంత రోగనిరోధక శక్తి అధికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.