హ్యాంగోవర్ ను తగ్గించే చిట్కాలు

ఫంక్షన్లు వచ్చినా, కొత్త సంవత్సరం వచ్చినా మద్యం ప్రియులకు జాతరే. మత్తులో ఊగుతూ, అదే ప్రపంచంగా సాగిపోతారు. కానీ దాని ఫలితంగా మత్తుదిగగానే తలపోటు అధికంగా ఉండటం, వాంతులు, కళ్లు తిరగడం వంటివి ఉంటాయి. అంతేకాదు దప్పిక, అలసట, ఒళ్లు వికారం వంటివి సాధారణంగానే కనిపిస్తాయి. ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలుగా భావించాల్సి ఉంటుంది. ఈ హ్యాంగోవర తగ్గించడానికి మందులు లేవు. ఇది గుడ్డు లేదా ఊరగాయ తినడం వల్ల పోతుందని చెప్తుంటారు. ఈ హ్యాంగోవర్ దిగడం ఎలాగంటే ఈ  చిట్కాలు పాటించండి. దోరగా వేయించిన కనరీ పిచ్చుక మాంసం, ఉప్పు చల్లిన రేగిపండ్లు, పచ్చిగుడ్లు, టమాటా జ్యూస్, సాస్ వంటివి తినమని చెప్తారు.

కానీ ఇవి నిజంగా తగ్గిస్తాయని చెప్పలేం. అయితే మత్తు దిగే వరకు తాగకుండా విరామం ఇవ్వడమే దీనికి ఉత్తమమైన మార్గం. గంటలో సుమారు 8 నుండి 12 గ్రాముల ఆల్కహాల్ ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాంగోవర్ నుండి బయటపడాలంటే మరింత ఆల్కాహాల్ తాగకుండా ఉంటే మంచిది. రెడ్ వైన్ తీవ్రమైన హ్యాంగోవర్ కు కారణం అవుతుంది. అందులో ఉండే రసాయన పదార్థం రక్త నాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వాడ్కాతో అలాంటి సమస్యలు తక్కువ. ఎందుకంటే స్వచ్ఛమైన వాడ్కాలో ఆల్కహాల్ మద్యం, నీరు మాత్రమే ఉంటాయి. దీని వల్ల హ్యాంగోవర్ తగ్గే అవకాశం ఉంటుంది.

పడుకునే ముందు నీళ్లు తాగినా హ్యాంగోవర్ ను తగ్గించుకునేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ఆరోగ్య కరమైన అల్ఫాహారం తిన్నా హ్యాంగోవర్ తగ్గించవచ్చని నిపుణులు చెప్తుంటారు. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం తీసుకుంటే హ్యాంగోవర్ నుండి తప్పించుకోవచ్చు. ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా హ్యాంగోవర్ నుండి విమక్తి పొందవచ్చు. అరటి పండు తినడం వల్ల పోటాషియం లోటు తీరుతుంది. పోటాషియం హ్యాంగోవర్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *