భారతదేశంలో చెలామణిలో ఎంత డబ్బుందో చూడండి

500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో నూతన నోట్లను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో నూతన నోట్లు మార్కెట్ లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పలువురికి రద్దైన నోట్ల స్థానంలో చెలామణిలో ఉన్న మిగిలిన నోట్లను అందుబాటులో ఉంచొచ్చు కదా అనే సందేహాలు కలగడం సహజం. కానీ రద్దైన నోట్ల స్థానంలో నూతన కరెన్సీ కాకుండా ప్రస్తుతం చెలామణిలో ఉన్న 50, 100 నోట్లను సమకూర్చడం అసాధ్యం. ఎందుకంటే మనదేశం లో అత్యధికంగా చెలామణిలో ఉన్నవి ఆ 500 మరియు 1000 రూపాయల పెద్ద నోట్లే. అసలు మన దేశం లో 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఏ కరెన్సీ ఎంత మేర చెలామణి లో ఉందో పరిశీలిద్దామా.
కరెన్సీ బిళ్ళలు (కాయిన్స్)
1 రూపాయి కాయిన్స్ – రూ.4,178 కోట్లు 
2 రూపాయి కాయిన్స్ – రూ.5,926 కోట్లు
5 రూపాయి కాయిన్స్ – రూ.7,045 కోట్లు 
10 రూపాయి కాయిన్స్ – రూ.3,703 కోట్లు
కరెన్సీ నోట్లు 
2 రూపాయల నోట్లు – రూ.853 కోట్లు 
5 రూపాయల నోట్లు – రూ.3,680 కోట్లు
10 రూపాయల నోట్లు – రూ.32,015 కోట్లు
20 రూపాయల నోట్లు – రూ.9,847 కోట్లు
50 రూపాయల నోట్లు – రూ.19,450 కోట్లు
100 రూపాయల నోట్లు – రూ.1,57,783 కోట్లు
500 రూపాయల నోట్లు – రూ.7,85,375 కోట్లు
1000 రూపాయల నోట్లు – రూ.6,32,568 కోట్లు
ఇవి కాక చిన్న చిన్న కాయిన్స్ రూ.700 కోట్లు, పాత మరియు చిన్న నోట్లు రూ.309 కోట్ల రూపాయల మేర ఉన్నది.
అంటే మొత్తంగా రూ.21,552 కోట్ల రూపాయలు కాయిన్స్ రూపంలో ఉండగా, రూ.16,41,880 కోట్ల రూపాయలు నోట్ల రూపంలో దేశం లో చెలామణి లో ఉంది.
ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం రూ.16,63,432 కోట్ల డబ్బు చెలామణి లో ఉంది. ఇది కాక బ్యాంకుల్లో ఒక లక్ష కోట్ల రూపాయల మేర ఫిక్సడ్ నిధులుగా ఉన్నట్లు అంచనా.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రద్దు కాబడిన 500 మరియు 1000 రూపాయల నోట్లే అత్యధికంగా రూ.14,17,943 కోట్ల రూపాయల మేర చెలామణిలో ఉన్నవి.
భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ దేశంలో చెలామణిలో డబ్బు ఎంతుందో అంత మేర బంగారు నిల్వలు చేసి పెట్టి ఉంటుంది. ఇప్పుడు రద్దైన నోట్ల స్థానంలో క్రొత్త నోట్ల ముద్రణ జరుగుతున్నది. వచ్చే సంవత్సరం మార్చి ఆఖరు లోపు రిజర్వు బ్యాంకుకు రద్దైన నోట్లు ఎంతవరకు చేరుతాయో అదే వైట్ మనీ మిగిలినదంతా బ్లాక్ మనీ క్రింద లెక్కల్లేకుండా పోతుంది. మిగులు ధనాన్ని దేశ ప్రభుత్వం దేశంలోవివిధ అవసరాల కోసం ఉపయోగించవచ్చు.
ఇదండీ మరి మన దేశంలో మన కరెన్సీ ప్రస్తుత స్థితి.
 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *