సత్తావుంటే కమ్మరావతి అని పెట్టండి చూద్దాం : మాజీ ఎంపీ రేణుకా చౌదరి

కమ్మ కులాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి హేళన చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. కావాలనే పనిగట్టుకొని కమ్మవాళ్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని కమ్మరావతి అని హేళన చేస్తున్నారని.. సత్తా ఉంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో నిర్వహించిన కమ్మ  సంఘం ఆత్మీయ సమ్మేళనంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. కమ్మ సామాజిక వర్గాన్ని తక్కువగా అంచనా వేస్తే జగన్‌కే నష్టమని హెచ్చరించారు. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హితవు పలికారు.

రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు ఉంటారని,  ప్రభుత్వం ఒక కులాన్నే టార్గెట్ చేసుకుని కుట్రలు చేయడం సబబు కాదన్నారు.  జగన్‌, వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నాయన్నారు. అధికార అండతో ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోవద్దని, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే గతంలోనూ ఖమ్మ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కూడా కమ్మ కులం గురించి ప్రస్తావించారు.

అసెంబ్లీలో చంద్రబాబు సతీమని భునేశ్వరిని అవమానించిన వారిని ఖూనీ చేస్తే రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. అయితే తాను కావాలని అనలేదని, ఆవేశంలోనే అన్నట్లు వివరిణ ఇచ్చుకున్నారు.  గతంలో కమ్మ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమ్మ వాళ్లను వర్గ శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు ప్రస్తావించారు. దానికి తగ్గట్లుగానే ఇటీవల చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కూడా కమ్మ వారికి చోటు కల్పించలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *