కిడ్నీ వ్యాధితో బాధపడేవారు తినాల్సినవి..తినకూడనివి.
నేడు అనార్యోగ సమస్యలతో బాధపడేవారిలో కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. మనిషిని వివిధ రకాలుగా కిడ్నీ నొప్పి ఇబ్బందులు పెడుతుంది. మూత్రం రంగు మారడం, కాళ్లవాపు వస్తే దాన్ని కిడ్నీ సమస్య ఉన్నట్లుగాను భావించాలి. కిడ్నీ చెడిపోతే సరిగ్గా నడవలేకపోవడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీల పనిచేయడం తగ్గితే ఎర్ర రక్తకణాల తయారీపై ప్రభావం చూపిస్తుంది. కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి వస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ కిడ్నీలు సరిగాలేవనే అనుకోవాలి. అయితే ఇలాంటప్పుడు తినే తిండిని కూడా కంట్రోల్ లో పెట్టుకుంటేనే ఆ ప్రమాదం నుండి బయటపడవచ్చు. ఏం తినాలో చూద్దామా…
అధిక స్థాయిలో నీళ్లను తాగాలి. దీనివల్ల రాళ్లు కరిగి మూత్రంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కొబ్బరిబోండా నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. బార్లీబియ్యం తినాలి. అరటిపండ్లను కూడా తరచూ తీసుకోవాలి. బాదంపప్పు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడేవాళ్లు తినవచ్చు. క్యారెట్, మొక్కజొన్న, నిమ్మకాయ, పైనాపిల్ తినవచ్చు. ఉలవచారు, బత్తాయి, చేపలు, దానిమ్మను కూడా తీసుకోవచ్చు. నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
బెర్రీలలో ఫైబర్, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి. మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కొన్నింటిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది. అవేంటంటే పాల కూరను దూరం పెట్టాలి. గుమ్మడికాయను తినకూడదు. సపోట, గోడంబి, టమోట తినకూడదు. అనివార్య పరిస్థితుల్లో టమోటా తిన్న తొడెం తుంచిన చోట ఉంటే నల్లటి పదార్థాన్ని తీసేయాలి. క్యాలీ ఫ్లవర్ తినకూడదు. పుట్టగొడుగులు, ఉసిరికాయ, దోసకాయ, వంకాయను దరి చేరనివ్వకూడదు. మటన్, చికెన్ తినడం తగ్గించాలి.