చంద్రునిపై రియల్ ఎస్టేట్.. రూ. 6వేలకు ఆరు ఎకరాలు..!
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా జరుగుతుంది. ఎప్పుడో ఓ సారి జోరు తగ్గనా గానీ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఏ రోజుకు అయినా సరే కచ్చితంగా రూపాయి పెట్టుబడి పెడితే.. అది పది రూపాయిలుగా వస్తుంది. అందుకే ఇప్పుడు భూమికి ఉన్న డిమాండ్ అనేది ఇంక దేనికి లేదని చెప్పతున్నారు. ఇదిలా ఉంటే ఇదే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది భూమి పైనే కాకుండా చంద్రునిపై కూడా జోరుగానే సాగుతున్నట్లు ఉంది. అందుకే చాలా మంది ఇంటర్నేషనల్ లూనార్ సొసైటీ అనే సంస్థకు డబ్బుు చెల్లించిన చంద్రునిపై ఫ్లాట్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవల త్రిపురాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఆరు ఎకరాలను చంద్రునిపై కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.
త్రిపురకు చెందన సుమన్ దేవ్ నాథ్ అనే వ్యక్తి చంద్రునిపై ఆరు ఎకరాల స్థలాన్ని కొన్నాడు. అత్యంత చీప్ గా దీనిని కొనుగోలు చేశాడు. ఇతను కొనుగోలు చేసిన ఆ భూమి విలువ కేవలం 6 వేల రూపాయిలు కావడం విశేషం. ఇంటర్నేషనల్ లూనార్ సొసైటీ అనే సంస్థకు ఇందుకు సంబంధించిన డబ్బును కూడా చెల్లించి రిజిస్టర్ చేయించుకున్నట్లు కధనాలు కూడా వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఆరు ఎకరాలు అత్యంత కారు చవకగా చంద్రునిపై దొరుకుతుందా అని చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. ఈ విషయాన్ని ఓ మీడియో సంస్థ ప్రచురించింది. అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ అవుతంది.
అయితే ఈ ఆరు ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలను ఇంటర్నేషనల్ లూనార్ సొసైటీ అనే సంస్థ అతనికి మెయిల్ ద్వారా పంపిననట్లు చెప్పుకొచ్చారు సదురు వ్యక్తి. అందుకే చంద్రుని పై కూడా రియల్ ఎస్టేట్ దందాలు బాగా పెరిగినట్లు చెప్తున్నారు విశ్లేషకులు. గతంలో గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం కూడా ఇలాంటి భూమిని కొనుగోలు చేశాడు. అప్పుడు కూడా ఈ వార్తలు చాలా వైరల్ అయ్యాయి.