పార్టీల్లో గుబులు పుట్టిస్తున్న ఎగ్జిట్ పోల్స్..ఎవరు గెలుస్తారంటే..?

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పార్టీలలో గుబులు పుట్టిస్తున్నా. కొన్ని సర్వేలు ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించగా మరో సర్వే అందుకు భిన్నంగా ఫలితాలు ఇంటాయని ప్రకటిస్తోంది. దీంతో పార్టీలలో గుండె దడ మొదలైంది. ఫలితాల్లో తమ భవితవ్యంపై అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఈ  సందర్భంగా సోమవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో ఉత్తరప్రదేశ్403కాగా ఎస్పీ 140-160(35%), బీజేపీ 220-240(38%), బీఎస్పీ 12-18(16%), కాంగ్రెస్ 6-10(7%)గా వెల్లడించాయి. పంజాబ్లో117 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 23-28(30%), ఆమ్ ఆద్మీ 59-66(39%) , ఎస్‍ఏడీ 17-21(20%), బీజేపీ 2-6(2%) వస్తాయని అంచనా వేసింది.

ఉత్తరాఖండ్ లో 70 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 32-37(43%) , బీజేపీ 30-35(42%), ఆమ్ ఆద్మీ0-1(9%), ఇతరులు 0-1(6%)  వస్తాయని పేర్కొన్నాయి. మణిపూర్ లో 60 స్థానాలు ఉండగా.. బీజేపీ 25-29(33%), కాంగ్రెస్ 17-21(29%), ఎన్‍సీపీ 7-11(11%), ఎన్‍పీఎఫ్ 3-5(8%) వస్తాయని తెలిపింది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ లో ఉత్తరప్రదేశ్  ఎస్పీ 235-240(39.5%), బీజేపీ 138-140(32.5%), బీఎస్పీ 19-23(14%), కాంగ్రెస్ 12-16(10%) సాధిస్తాయని తెలిపింది.  పంజాబ్ లో కాంగ్రెస్58-61(32.5%), ఆప్ 34-38(29.5%), ఎస్‍ఏడీ 18-21(25.5%), బీజేపీ4-5(9.5%) సీట్లు పొందుతాయని తెలిపింది.

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ 43-47(46%), బీజేపీ 20-21(40.5%), ఆప్2-3 (9.5%) ప్రకటించింది. గోవాలో కాంగ్రెస్ 21-22(45%), బీజేపీ 9-10(34%) ఆప్2-3(8.5%), ఇతరులు 5-6 (12.5%) స్థానాలు పొందుతాయని తెలిపింది. అయితే యూపీలో లోపించిన శాంతి భద్రతల దృష్ట్యా అఖిలేష్ యాదవ్ నెగ్గుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీకి సీఎం అయ్యే రాత మళ్లీ అఖిలేష్ కు ఉందంటున్నారు. అయితే ఫలితాలు అన్నీ ఎప్పుడూ సక్రమంగా వచ్చిన దాఖలాలు కూడా లేవని కొట్టిపారేస్తున్నారు కొందరు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *