వైరల్ అవుతున్న గిరిజన యువకుడి వెడ్డింగ్ కార్టు.. ఎలా చేశాడంటే?
పుర్రెకో బుద్ధి… జిహ్వకో రుచి అని అంటారు పెద్దలు. వారేమీ ఊరికే అనలేదు. ఎన్నో చూసి ఈ సామెత కరెక్ట్ అని డిసైడ్ అయ్యి మరీ చెప్పి ఉంటారు. అయితే వినూత్నంగా ఆలోచించడం అనేది మనిషిని ఇతరుల నుంచి వేరు చేస్తుంది. ఇలా వినూత్నంగా ఆలోచించే వారు ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. ఉదాహరణకు.. ఇటీవల ఓ యువకుడు తన రెజ్యూమే ను ఓ కంపెనీ కరపత్రంపై ప్రచురించి వైరల్ అయ్యాడు. ఆ యువకుడి వినూత్న ఆలోచనను చూసిన ఆ సంస్థ భారీ మొత్తంలో సాలరీ ఇచ్చి హైర్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఇంకో వ్యక్తి అలానే ఆలోచించాడు. తన పెళ్లి కార్డును ఏకంగా ఆధార్ కార్డు పై ప్రచురించి వైరల్ అవుతున్నాడు.
ఇంతకీ ఏం జరిగింది అంటే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓ గిరిజన యువకుడు వినూత్నంగా ఆలోచించి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ఆధార్ కార్డుపై ప్రచురించాడు. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆధార్ కార్డుపై వివాహ ఆహ్వానానికి ఇవ్వాల్సి కీలక సమాచారాన్ని స్పష్టంగా అందులో ఉంచాడు. దీనితో పాటు పెళ్లికి వచ్చేవారు తీసుకోవాల్సిన కొవిడ్ జాగ్రత్తల గురించి కూడా రాసుకొచ్చాడు.
పెళ్లి ముహుర్తం.. ఎప్పుడు జరిగేది… ఎక్కడ జరిగేది… ఎవరితో ఇలా కావాల్సిన సమాచారం అంతటినీ దానిలోనే పొందు పరిచాడు. ఇలా తాను చేసిన ఈ ప్రత్యేక కార్డును మిత్రులకు పార్వర్డ్ చేయగా.. వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.