మైల్ స్టోన్ రంగుల వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?
Milestone Colors: మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మనం గమ్యం మీదుగా అనేక రకాల మైలురాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడడం వల్ల మన గమ్యం ఇంకా ఎంత దూరం ఉందో మనకు తెలిసి పోతుంది. అలాంటి మైలు రాళ్లపై కొన్ని రకాల రంగులు వేస్తూ ఉంటారు. మరి ఆ రంగుల గురించి మనం ఎప్పుడూ పట్టించుకోము. కానీ వాటి వెనక కొన్ని రహస్యాలు ఉంటాయి. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
మీరు ఏదైనా దారి గుండా ప్రయాణించేటప్పుడు అక్కడ పసుపు రంగు మైలురాయి కనిపిస్తే మీరు నేషనల్ హైవేపై ప్రయత్నిస్తున్నారని అర్థం. నేషనల్ హైవే లకు పక్కన ఉండే మైలు రాళ్లకు ఎక్కువగా ఎల్లో కలర్ వేస్తారు. ఆ రోడ్లను కొన్ని కోడ్ భాషలో కూడా పిలుస్తారు.
మీరు ఏదైనా రోడ్డుగుండా వెళుతున్నప్పుడు గ్రీన్ రంగు మైలురాయిని చూస్తే అది రాష్ట్ర స్థాయి రోడ్డు రవాణా అని అర్థం. ఆ రోడ్లను రాష్ట్రప్రభుత్వం మాత్రమే నిర్మిస్తుంది. వాటి నిర్వహణ బాధ్యతలు మొత్తం ప్రభుత్వమే చేపడుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల లను నగరాలను క్రాస్ చేసేటప్పుడు ఈ గ్రీన్ రంగు మైలురాళ్ళు కనిపిస్తాయి.
ఇక మీరు వెళ్లే రోడ్డు గుండా.. నలుపు, తెలుపు, బ్లూ కలర్ కలిగినా మైలురాళ్లను చూస్తే మీరు ఏదైనా పెద్ద నగరం లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని అర్థం. అంతేకాకుండా జిల్లాలోకి కూడా ఎంటర్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ రోడ్డు నిర్వహణ బాధ్యత మునిసిపల్ కార్పొరేషన్ వహిస్తుంది.