విజయనగరం నేపథ్యంలో ఎన్టీఆర్ సరికొత్త ప్రాజెక్ట్!
Jr Ntr: ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఎన్టీఆర్.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. తన మానరిజంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒక్కడిగా గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
దర్శక ధీరుడు జక్కన్న రూపొందుతున్న త్రిబుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండే.. కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేసిన విషయం మనకు తెలుసు. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా స్టార్ట్ చేస్తున్నారు.
ఇక ఉప్పేన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు స్టోరీ కి ఫిదా అయిన తారక్ వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తారక్ ఇమేజ్ కు అనుగుణంగా తీస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలిసాయి. విజయనగరం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్ వస్తుంది. అప్పటి కాలంలో ఆ ప్రాంతాల్లో జరిగిన కొన్ని నిజాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.