యూట్యూబ్ పుణ్యానా విమానం తయారు చేసుకున్న ఫ్యామిలీ!
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ దయవల్ల మానవుని జీవన విధానం చాలావరకు అప్డేట్ అయిందని చెప్పవచ్చు. యూట్యూబ్ ఫాలో అయ్యి అనేక రకాల వాహనాలు తయారుచేసి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు. ఇంట్లో టీవీ రిమోట్ నుంచి ఎటువంటి సమస్యనైనా యూట్యూబ్ ద్వారా క్లియర్ చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఇంగ్లాండ్ లో ఉంటున్న ఒక ఫ్యామిలీ కూడా సొంతంగా నాలుగు సీట్లు ఉండే విమానం తయారు చేసింది.
ఆ వ్యక్తి పేరు అశోక్ అలిసెరిల్. అతని భార్య పేరు అభిలాష దుబె. వీరికి తార, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక లాక్ డౌన్ వృధా చేయకూడదని ఈ ఫ్యామిలీ నిర్ణయించుకుంది. పనికిరాని వస్తువులతో విమానం తయారు చేసి చూపించారు. అశోక్ వృత్తిపరంగా పైలెట్ కాబట్టి ఆయనకు విమానానికి సంబంధించిన విషయాలు అన్నీ తెలుసు.
కానీ విమానం ఎలా తయారుచేయాలో అతనికి ఐడియా లేదు. ఇక విమానం తయారు చేయడానికి యూట్యూబ్ నే నమ్ముకున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా కష్టపడ్డారు. తమకు కావాల్సిన విమాన పార్ట్ లు అన్నీ 2020 మార్చి లో సెట్ చేసుకున్నారు. అప్పటి లాక్ డౌన్ సమయంలో పార్టులు అన్నీ కలెక్ట్ చేసుకున్నారు.
అలాగే తమకు ఎలా ఉండాలో అలా కొన్ని పార్టులను తయారు చేసుకున్నారు. దీని కోసం మొత్తం 1.57 కోట్లు ఖర్చు చేశారు. ఎట్టకేలకు విమానాన్ని అనుకున్న విధంగానే తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.