మిరియాల పొడి, తేనెను కలుపుకొని తింటే ఎంత ప్రయోజనమో తెలుసా?
Health Tips: మిరియాలు.. ఇవి ప్రాచీన కాలం నుంచి దేశవ్యాప్తంగా మసాలా దినుసులుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి పుష్పించే మొక్కలలో పొదలుగా పెరిగే మొక్కల నుండి వస్తాయి. ఇవి ఫైబర్ జాతికి చెందినవి. ఇక వీటిని నల్ల మిరియాలు అని విరివిగా పిలుస్తారు. మిరియాల పొడిని తేనెలో కలుపుకొని తీసుకుంటే మన శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది: ఈ శీతాకాలంలో అందరికీ జలుబు తరచుగా వస్తూ ఉంటుంది. అలాంటి వారు ఒక టీస్పూన్ మిరియాల పొడి లో ఒక టీస్పూన్ తేనెను కలిపి తీసుకుంటే ఇవి మన శరీరంలో దగ్గు, జలుబును తగ్గించడానికి ఎంతో సహాయ పడతాయి.
రోగనిరోధకశక్తి వ్యవస్ధను బలపరుస్తుంది: మీరు తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. కాబట్టి దీనికోసం మిరియాలు కలిపిన నీటిని తాగడం మంచిది. అంతేకాకుండా ఒక పాత్రలో నెయ్యి వేసి, కారం వేసి వేయించాలి. ఆ తర్వాత కొంత సేపు మరగించి ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలపడుతుంది.
పొట్టకు విశ్రాంతి కలిగిస్తుంది: కొంతమంది అజీర్ణంతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటి వారు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఏసిడిటీ, కడుపు ఉబ్బరం, మల బద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాకుండా ఈ మిరియాల పొడి, తేనె ను క్రమంగా తీసుకోవడం ద్వారా ఒత్తిడి, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను దూరం పెట్టవచ్చు.