బంగార్రాజు సినిమాలో తన పాత్ర అలా ఉంటుందని ముందుగానే చెప్పేసిన కృతి శెట్టి!
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి థియేటర్ లలో హడావిడి చేయడానికి రెడీగా ఉంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన కృతి శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకుంది. బంగార్రాజులో తన పాత్ర నాగలక్ష్మి గురించి కళ్యాణ్ కృష్ణ చెప్పినప్పుడు నవ్వానని తెలిపింది. అలాంటి వారు కూడా ఉంటారా అని.. అందుకే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నానని అన్నది.
ఈసినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే అనుకుంటారని అనుకుంటున్నాని తెలిపింది. బీటెక్ చదివిన గ్రామ సర్పంచ్ లా చేశానని అన్నది. ఇందులో తన రోల్ చాలా ఫన్నీగా ఉంటుందట. నాగార్జున తో సినిమా అన్నప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో? అనిపించిందని అన్నది. కానీ ఆయన తోటి మనుషులపై చూపించిన గౌరవం చూసి ఆశ్చర్యపోయానని అన్నది.
తనను జూనియర్ లా కాకుండా తోటి టీం మెట్ లా ట్రీట్ చేసారని అన్నది. నాగ చైతన్య గారు కూడా చాలా కూల్ గా సరదాగా ఉంటారని తెలిపింది. ఇక తనకు సంక్రాంతి గురించి పెద్దగా తెలియదని.. కానీ బంగార్రాజు చేస్తున్నప్పుడు తెలిసిందని తెలిపింది. సంక్రాంతికి ఏ సినిమా విడుదలైన చూస్తామని తనకు తెలిసిన తెలుగు వారు చెప్పడంతో ఇక్కడి వారు సినిమాని ఎంత గా ప్రేమిస్తారో అర్థమైందని తెలిపింది కృతి శెట్టి.