ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను పాటించాల్సిందే!
Health Tips: మనిషి ఏది ఏమైనా తన జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అలా పెద్దలు కూడా కొన్ని సూత్రాలను చెబుతుంటారు. ఈ సూత్రాల్లో ఆరోగ్యం ఎంతోకొంత ఇమిడి ఉంటుంది. దీనిని కొంత మంది ఏ మాత్రం పట్టించుకోరు. వీటి ద్వారా ఉపయోగం ఉన్నా లేకపోయినా ప్రయత్నించడం చాలా మంచిది.
పెద్దలు చెప్పే సాంప్రదాయాల్లో అనేక ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట అన్నం తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు త్వరగా అరగవు. దీని కారణంగా ఒంట్లో పసరు ఇమిడిపోతుంది. అలా జరిగితే తలనొప్పి, వాంతులు లాంటివి మొదలవుతాయి. అందుకని పరిగడుపున అల్లం కాల్చుకొని తినడం చాలా మంచిది.
రాత్రి భోజనం చేసిన తర్వాత ఓపిక లేక కుర్చీలలో కాసేపు కూర్చుని ఆ తర్వాత మంచంపై పడిపోతారు. దీని కారణంగా అన్నం సరిగా అరగక.. పొట్ట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయినా నడవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత కొంత వరకు నడిచిన తర్వాత తమలపాకుల పాన్, సోంప్ వంటివి తినడం చాలా మంచిది ఇలా తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ మరింత సాఫీగా జరుగుతుంది. ఇది మలబద్ధకం రాకుండా కూడా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా పడుకునేటప్పుడు ఎడమచేతి వైపు తిరిగి పడుకోవడం గుండెకు చాలా మంచిది. ఇది సూత్రం అయినప్పటికీ గుండెకు మేలును చేస్తుంది.