ఆర్జీవి – పేర్ని నాని ట్విట్టర్ గొడవపై స్పందించిన వైయస్ జగన్.. ఏమన్నారంటే?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల ధర విషయంలో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక టికెట్ ధరల విషయంలో రామ్ గోపాల్ వర్మ కూడా గట్టిగానే స్పందించాడు. ఇక ఇటీవలే రామ్ గోపాల్ వర్మ, వైసీపీ మంత్రి పేర్ని నాని లు ఇద్దరు కూడా సినిమా టికెట్ ధర విషయంలో ట్విట్టర్ వేదికగా బాగా మాటల యుద్ధం చేశారు.
టిక్కెట్ల రేట్ల విషయం లో ఏపీ ప్రభుత్వం పై మండిపడుతూ వర్మ నానితో బాగా చెలరేగాడు. అమ్మే వాడికి, కొనే వాడికి లేని బాధ మధ్యలో ప్రభుత్వానికి ఏంటంటా అని ప్రశ్నించాడు. అంతేకాకుండా ఓపెన్ గా టికెట్లు అమ్ముతుంటే ఆ విషయంలో ప్రభుత్వం పెత్తనం ఏంటి అని ప్రశ్నించాడు. పేదల కోసం ప్రభుత్వం పని చేస్తుందని చెప్పడంలో తప్పు లేదు..
కానీ పేదలను ధనికులుగా చేయాలి. అంతే కానీ ధనికులు పేదలు లాగా చేయకూడదు అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇక పేర్ని నాని అనుమతిస్తే ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ నిపుణులతో టీవీ డిబేట్ కి కూడా రెడీ అవుతానని.. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వాదనలు తొలగిపోతాయని అన్నాడు.
దీంతో నాని కూడా ఓకే అని స్పందించాడు. ఇక వీరిద్దరి గొడవపై తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై ఎక్కువగా సినిమా టికెట్ల వ్యవహారం, విమర్శలు ఉండటంతో జగన్ ఈ విషయంలో వారికి స్పందించినట్లు తెలుస్తోంది.