ఇంట్లో పిల్లలు సరిగ్గా తినడం లేదా?.. అయితే ఇలా చేసి చూడండి
పిల్లలు ఎక్కువగా జంక్ఫుడ్వైపే మొగ్గుచూపుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, చిన్న వయసులో వారికి ఎక్కువగా పోషకాహారం చాలా అవసరం. ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా తినిపిస్తుండాలి. కానీ, అవి చూస్తేనే ఏదో తెలియని చిరాకు ఫేస్ పెడుతూ.. పక్కకు తప్పుకుంటారు పిల్లలు. అయితే, తాజాగా మచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం పిల్లలు తమకు తామే స్వయంగా ఆహారం తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి అంటున్నారు. ఇలా చేస్తే.. ఆహారం తనే అలవాటుతో పాటు ఇతర నైపుణ్యాలు మెరుగుపడటంలోనే ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పిల్లలు ఇష్టంగా ఆహారం తినేలా చేస్తే.. చిన్నతనం నుంచే వారిని ఉబకాయం నుంచి దూరం చేయచ్చు. క్రమంలోనే పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను ఎలా చేయాలో నిపుణులు సూచిస్తున్నారు. ఆవేంటో చూద్దాం.
పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన చిరుతిండ్రు అలవాటు చేయాలి. ఇటీవలే కాలంలో ఫైబర్, ఫ్రూట్స్‌తో తయారు చేసే చాక్లేట్స్, బస్కట్స్ ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. వాటిని అలవాటు చేస్తే చాలా మంచిది. తద్వారా జంగ్ఫుడ్కు దూరం చేయచ్చు. ఆహారం బాగా తింటే వేగంగా జిర్ణం అవుతుంది. దానికి కొన్ని పద్దతులను అలావాటు చేయాలి. ఏదైనా కథలు కానీ, పోటీలు కానీ పెడుతూ.. తినడం ఎలాగో నేర్పిస్తే చాలా త్వరగా అలావాటవుతుంది.
ఏదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు మీతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లండి. తినే ఆహారాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేర్పించండి. ఈ విధమైన అలవాట్ల వల్ల.. పిల్లలకు పోషకాహారం పట్ల అవగాహన వస్తుంది. రోజూ ఒకే రకమైన ఫుడ్ తింటే బోర్ కొడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఒకే ఫుడ్‌నే రకరకాలుగా వండి కొత్త వంటకాలు పెడుతుండాలి. అవి కూడా వాళ్లకు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడే వాటిని ఆసక్తిగా తింటారు. మనిషికి పంచేంద్రియాలు అనుభూతి చెందేలా తినే ఆహారం ఉండాలని నిపుణులు చెబుతారు. ఇలా చేస్తే చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆహారం పట్ల అవగాహన వస్తుందని అంటున్నారు.