చేపలు ఎక్కువగా తినేవారికి ఈ సమస్యలు దరిచేరవట!
ప్రస్తుత కాలంలో ఆహారంలో మార్పులు వల్ల చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు అనారోగ్య సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది.ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి వారంలో కనీసం రెండు, మూడు సార్లు చేపలు ఆహారంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. చేపలు తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అవి ఏమిటో తెలుసుకోండి మరి.
అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి చేపలు తినడం వల్లన ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు . చేపలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చేపలు అధికంగా తినే వారిలో గుండె సమస్యలు దూరం చేసుకోవచ్చు.చేపలలో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. అలానే కీళ్ల నొప్పులను తగ్గించేందుకు మరియు రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా కాపాడుతాయి. స్త్రీలలో రుతుక్రమం సమస్యకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి.
చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. చేపల్లో బీ12 విటమిన్, రైబోప్లవిన్, నియాసిన్, బయెటిక్, థయామిన్ తదితర విటమిన్లు లభిస్తాయి. సముద్ర చేపల కాలేయంలో విటమిన్ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది.