డ్రై బీన్స్ రోజూ తింటే ఏమవుతుంది?
అధిక బరువు ఉన్నవారికి డ్రై బీన్స్ మంచి ఆహారంగా చెప్పవచ్చు.అయితే అధికంగా పొట్టు తీసిన శనగపప్పును అనేక వంటకాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయకుండానే లభించే శనగలను నానబెట్టి, ఉడకబెట్టి లేదా మొలకల రూపంలో తింటే ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.ఉదయాన్నే మొలకలు గుప్పెడు తినడం వలన పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అవేమిటో తెలుసుకుందాం..
రోజూ గుప్పెడు డ్రై బీన్స్ తింటే వీటిలోని ప్రొటీన్ల మూలంగా శరీర అవసరాలకు తగిన శక్తి సమకూరుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి పలు రోగాలు రాకుండా చేస్తుంది.పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో లభించడంతో ఎముకలు దృఢంగా మారుతాయి..డ్రై బీన్స్ లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.మధుమేహం కలిగినవారు రోజూ గుప్పెడు నానిన డ్రై బీన్స్ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
డ్రై బీన్స్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించి వేస్తుంది.దీంతో గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. శనగల్లోని ఎమినో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదల, ప్రసారానికి దోహదపడతాయి. అలానే డ్రై బీన్స్ తరచూ తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉన్నవారు డ్రై బీన్స్ ఎంతగానో మేలు చేస్తుంది.శనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్, సెరొటోనిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి.పచ్చ కామెర్లు, చర్మ సమస్యలకు శనగల తీసుకోవడం వలన వాటిని దూరం చేసుకోవచ్చు.