దారుణం: అల్లుడిని చంపాలని పథకం వేసిన మామ.. అల్లుడు లేకపోవడంతో తల్లి పై దాడి!

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.పెళ్లి తర్వాత తన కూతురిని అత్తవారింటికి తీసుకు వెళ్లలేదని ఆగ్రహించిన తండ్రి ఎలాగైనా తన అల్లుడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలోనే చేతితో కత్తి పట్టుకుని అల్లుడు ఇంటికి వెళ్ళాడు. విషయం తెలుసుకొని అల్లుడు పారిపోవడంతో ఇంటిలో అల్లుడు లేకపోవడంతోతన తల్లి పై విచక్షణారహితంగా దాడి చేసి చంపిన ఘటన జగిత్యాల పట్టణ పరిధి బీట్ బజార్ లో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

జగిత్యాల పట్టణంలోని బీట్‌ బజార్‌కు చెందిన మహేష్‌.. తన కూతురు భవానిని స్థానికంగా నివాసం ఉంటున్న కిరణ్‌కు ఇచ్చి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేశారు.అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత భవాని కొన్ని నెలల నుంచి తన తండ్రి ఇంటిలో నివాసం ఉంటుంది.ఈ క్రమంలోనే మహేష్ తన అల్లుడు కిరణ్ ను పలుమార్లు కలిసి తన కూతురిని వారి ఇంటికి తీసుకెళ్లాలని భార్య భర్తల గొడవలు సర్వసాధారణమే సర్దుకుపోవాలని నచ్చ చెప్పాడు .

మహేష్ తన అల్లుడికి పలుమార్లు హెచ్చరించిన తన మాట వినకపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక రోజు తనను చంపేయాలని పథకం వేసాడు. ఈ క్రమంలోనే చేతితో కత్తి పట్టుకుని మహేష్ తన అల్లుడి ఇంటి వైపు వెళ్ళాడు.ఈ విషయం ముందుగానే తెలుసుకున్న కిరణ్ ఇంటిలో లేకుండా పారిపోవడంతో తన తల్లి మాత్రమే ఇంటిలో ఉండటం వల్ల మహేష్ అల్లుడు లేడన్న కోపంతో తల్లి విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను చంపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *