వ్యాయామం, యోగా ద్వారానే మంచి ఆరోగ్యం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని చేపల మార్కెట్ వద్ద గల పార్కులో (మేకల మండి) ఆరోగ్య అవగాహనా సదస్సు జరిగింది. సంస్థ జిల్లా అధ్యక్షులు సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రతి నవంబర్ లో దేశవ్యాప్తంగా ఇటువంటి సదస్సులను నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే దేశం అభివృద్ధిలో ఉన్నట్లు సూచికని తెలిపారు. డాక్టర్ కాలేషా మాట్లాడుతూ మద్యపానం, సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్ ల వల్ల కలిగే అనర్ధాలను, సోకే వ్యాధులను వివరించారు. మైనార్టీ నాయకులు జాకీర్ మాట్లాడుతూ వ్యాయామం, యోగా ఎదో ఒక మతానికే చెందినవి కావని ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కోసం అవలంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ యోగాసనాలు వేసి వాటి ఉపయోగాలను వివరించారు. ఈ సదస్సులో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డాక్టర్ రఫీ, ఉద్దీన్, హఫీజ్ అబ్దుల్ అజీజ్, హఫీజ్ ఖలీల్ అహ్మద్, వివిధ పార్టీల మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *