మేయర్ గారూ… ఇలాగేనా కాలువల నిర్మాణం చేపట్టేదంటూ ప్రశ్నిస్తున్న నెల్లూరు యువకుడు

నెల్లూరు నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనులు చాలా నాసిరకంగా నిర్మిస్తున్నారని, నిర్మాణాల పనులు అధ్వాన్నంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ నెల్లూరు యువకుడు తన ఆవేదనను వ్యక్తపరచాడు. నిర్మాణాల్లో సిమెంట్ లో ఇసుక కలుపుతున్నారా లేక ఇసుకలో సిమెంట్ కలుపుతున్నారా అంటూ ప్రశ్నించాడు. నిర్మాణాలకు సంబంధించిన వీడియోను, ఫోటోలను ఫేస్ బుక్ లో ఉంచి నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ కు, కలెక్టర్ ముత్యాలరాజు లకు చేరే వరకు ఈ నాసిరక నిర్మాణాల పై వారు చర్యలు చేపట్టే వరకు షేర్ చేయాలని అందర్నీ అభ్యర్దిస్తున్నారు. ఈ యువకుడు పెట్టిన పోస్టును షేర్ చేస్తూ పలువురు అభినందిస్తున్నారు.
ఆ వీడియో, ఫోటోలు మీ కోసం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *