మీ పాత నోట్లు తీసుకొచ్చి తాగండి బాబు తాగండి అంటున్న బార్లు, బ్రాందీ షాపులు
November 15, 2016
500 మరియు 1000 నోట్ల రద్దు నేపథ్యంలో క్రొత్త నోట్ల కోసం, చిల్లర కోసం జనం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ ఉండడంమనం చూస్తున్నాం. సాధారణ షాపింగ్, చిల్లర సరుకులు కొనుగోలు చేసేందుకు పెద్ద నోట్లను అనేకమంది వ్యాపారస్తులు అంగీకరించట్లేదు. ఈ స్థితిలో బార్లు, బ్రాందీ షాపులు మాత్రం మూడు పూవులు, ఆరు కాయలుగా తమ వ్యాపారాన్ని జోరందించాయి. సాధారణంగా అయితే ఆ నోట్లను తీసుకోమని కాంబో ప్యాక్ లుగా పూర్తి 500 లేదా 1000 మొత్తానికి కొంటే ఆ నోట్లు తీసుకుంటామని కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు పలు షాపులు 500 మరియు 1000 నోట్లు ఈ క్రింది సందర్భాల్లో తీసుకుంటాం అని నోటీసులు అంటిస్తున్నాయి.