కిటకిటలాడుతున్న బ్యాంకులు
November 10, 2016
దేశవ్యాప్తంగా బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. 500 మరియు 1000 రూపాయల నోట్ల స్థానంలో క్రొత్త 500 మరియు 2000 నోట్లు రావడంతో మార్పు చేసేందుకు జనం బ్యాంకులు తెరవక ముందు నుండే బ్యాంకుల ముందు బారులు తీరారు. ఒక్కో బ్యాంకుకు 30 లక్షల రూపాయలే క్రొత్త నోట్లు రావడంతో, కొన్ని బ్యాంకులకు అసలు రాకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజుకు 4 వేల రూపాయలు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉండడంతో అనేకమంది వినియోగదారులు తమ అకౌంట్లలో నగదును జమ చేసుకుంటున్నారు. రెండున్నర లక్షల రూపాయల డిపాజిట్ దాటితే పాన్ కార్డు తప్పని సరి. పాత నోట్లను మారుస్తున్న క్రమంలో వినియోగదారుల గుర్తింపు విషయమై బ్యాంకు సిబ్బందితో అనేకమంది ఘర్షణ పడుతున్నారు. తమకు కేటాయించిన పని మాత్రమే తాము చేయగలమని తమ పై కోప్పడితే ఏమొస్తుందని పలు బ్యాంకుల్లో సిబ్బంది వాపోతున్నారు.