కాలువ గట్ల పై ఇళ్లు తొలగిస్తే ఊరుకోం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
November 8, 2016
సరైన పునరావాసం చూపకుండా కాలువ గట్లపై ఉన్న ఇళ్లను అధికారులు తొలగిస్తాం అంటే చూస్తూ ఊరుకోమని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేసారు. నగరంలోని 41వ డివిజన్ మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, పాముల మాన్యం తదితర ప్రాంతాల్లోని కాలువ గట్ల పై నివాసం ఉంటున్న ప్రజల ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతాల్లోని ఇళ్లను తొలగించాలని చెప్పేందుకు కమీషనర్ వెంకటేశ్వర్లు అక్కడికి రాగా డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తో కలిసి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కాలువల్లో పూడిక తీసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి కాని వారి ఇళ్ళని తొలగించాలని చూడడం సరికాదన్నారు. కాదు కూడదు అంటే ఉద్యమం చేపడుతామని హచ్చరించారు. మూలాపేట లోని దేవుని మాన్యం లోని కొంతభూమిని పేదలకు కేటాయించాలని కమిషనర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు ఇంతియాజ్, హంజా హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.