ఇదేమి దైన్యం!
November 25, 2016
ఒళ్ళు గగుర్పొడిచేలా ముక్కుపుటలు అదిరే మురుగు కాలువలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వీరంతా నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు. సగటు మనిషి చూసేందుకే భయపడే విధులు నిర్వహిస్తున్న వీరికి ప్రత్యేక భద్రత ఏమైనా ఉందంటే అదీ శూన్యమనే చెప్పాలి. కనీసం విధులు నిర్వహించే సమయంలో కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు లాంటి కనీస సౌకర్యాలను కూడా సంబంధిత అధికారులు వీరికి సమకూర్చటం లేదు. దీంతో కార్మికులు తరచూ ప్రమాదాలు, వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో కన్పించిన చిత్రాలే అందుకు నిదర్శనాలు.
మురుగు కాలువలో పాట్లు పడుతున్న పారిశ్యుద్ధ కార్మికులు
చేతికి గ్లౌజులు లేకుండా విధులు నిర్వహిస్తున్న పారిశ్యుద్ధ కార్మికులు
మెడ లోతుకి డ్రైనేజీలో మునిగిన కార్మికుడు
మురుగు కాలువల్లో దూరి ఇలా చేయడం ఎవరి తరం?
ఫోటోలు: సి.హెచ్.రాజా రమేష్
News & Photos Courtesy: ఈనాడు పత్రిక, నెల్లూరు