అనుమతులు లేని కార్యక్రమాలు చేపట్టకండి : నెల్లూరు పోలీస్
January 25, 2017
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26 వ తేదీన వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద పోరాటానికి సిద్ధం అంటూ సోషల్ మీడియా లో అనేక మంది చేస్తున్నప్రచారానికి స్పందించవద్దని విశాఖపట్నంలో ఎటువంటి కార్యక్రమానికి అనుమతి లేదని నెల్లూరు పోలీస్ ఫేస్ బుక్ ద్వారా యువతకి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నుండి కొందరు యువత అక్కడికి వెళ్లనున్నారని అక్కడ సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. మరియు పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడం వలన అటువంటి కార్యక్రమంలో పాల్గొనుట చట్ట విరుద్ధం అని తెలిపారు. అటువంటి కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. పాల్గొని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోబడును అని తెలిపారు.