రేగిపండ్లు అనగానే సంక్రాంతి ముగ్గులు గుర్తుకొస్తాయి. ఎందుకంటే పల్లెల్లో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిలో రేగిపండ్లు పెడతారు. పల్లెటూరిలో వీటికి ఎక్కువ అనుబంధం ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయానికి ఈ రేగుపళ్ళు మంచి కాపుకు వస్తాయి. అలాంటి ఈ రేగి పండ్లు తినడం ద్వారా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది: రెండు డజనుల రేగిపండ్లను అర లీడర్ నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించి దానికి కొంచెం చక్కెర జోడించి రాత్రి పడుకునే సమయంలో తీసుకుంటే ఇది మన మెదడు మరింత షార్ప్ గా పని చేయడానికి సహాయపడుతుంది.
జ్వరం,ప్ల్వూ : రేగుపండ్లను తరచూ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి జ్వరం జలుబు వంటి సమస్యలు రాకుండా సహాయపడతాయి. అంతేకాకుండా ఈ చెట్టు బెరడును రక్త విరోచనాలు అరికట్టడానికి ఉపయోగిస్తారు. ఈ బెరడు కాషాయం మలబద్దకానికి కూడా బాగా పనిచేస్తుంది.
స్కిన్ ట్యాగ్స్: రేగు ఆకులను మెత్తగా నూరి కరుపులు ఉన్నచోట రాసుకుంటే అవి చాలా వరకు నయం అవుతాయి. రేగుపండ్లు బరువును పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కాలేయం చేసే పనిని మరింత మెరుగు పరచడానికి ఈ మధ్యకాలంలో చైనీయులు రేగి పండ్లు తో చేసిన టానిక్ ను అధిక మొత్తంలో తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇవి కండరాలకు బలాన్ని ఇవ్వడం, శారీరకంగా శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి.