Site icon 123Nellore

విటమిన్ బి12 పెంచుకోవాలా అయితే వీటిని ట్రై చేయండి!

Vitamin B12: విటమిన్ బి12 ప్రధానంగా జంతువులలో లభ్యం అవుతుంది. శాకాహారంలో ఈ విటమిన్ అనేది లభించదు. కాబట్టి శాకాహారుల్లో ఈ విటమిన్ లోపం ఎక్కువగా జరుగుతుంది. అలాంటి వారికి కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ విటమిన్ లోపానికి చెక్ పెట్టవచ్చని తెలుస్తుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Vitamin B12

సముద్రపు చేపలైన సాల్మన్ వంటివి రోజు తీసుకోవడం వలన మన శరీరానికి అవసరమైన చాలా రకాల పోషక పదార్థాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ బి 12 అయితే మరింత పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి.

గుడ్లను విరివిగా తినడం ద్వారా మన శరీరానికి విటమిన్ బి 2, విటమిన్ బి12 సమృద్ధిగా దొరుకుతాయి. కోడిగుడ్డు సొనలో విటమిన్ బి 12 ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి కోడి గుడ్డు సొనని ఎక్కువశాతం తీసుకోవడం మంచిది.

మేక మాంసం లో విటమిన్ బి 12 కావలసినంత లభిస్తుంది. కాకపోతే మాంసాన్ని ఎంచుకునే ముందు తక్కువ శాతం కొవ్వు ఉండే మాంసాన్ని ఎంచుకోవడం మంచిది. దీంతో పాటు పాలు కూడా తాగడం చాలా మంచిది. పాలలో కూడా విటమిన్ బి12 లభ్యమవుతుంది.

ఇక విటమిన్ బి 12 అధికంగా లభించే ట్రౌట్ చేపలను తినడం చాలా మంచిది. ఇందులో చాలా విలువైన పోషకాలు ఇమిడి ఉన్నాయి. ఈ చేప తినడం వల్ల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి అదనంగా అందుతాయి. ఇవేకాకుండా శాఖాహారులు ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Exit mobile version