Site icon 123Nellore

నన్ను దత్తపుత్రుండంటే..మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రులు అంటాం : పవన్

వైసీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి సీబీఎన్ దత్తపుత్రుడు అని అంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దత్తపుత్రుడు అని అంటే వైసీపీ నేతల్ని సీబీఐ దత్తపుత్రులు అనాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో మంగళవారం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం అందించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. చాలా మంది వైసీపీ నాయకులను సీబీఐ దత్తత తీసుకుందని ఎద్దేవా చేశారు. మమ్మల్ని టీడీపీ బీ-టీమ్ అంటే మిమ్మల్ని చర్లపల్లి షటిల్ టీమ్ అనాల్సి వస్తుందన్నారు.

ఆర్థిక నేరాలు చేసి జైళ్లలో కూర్చున్న మీరా మాపై విమర్శలు చేసేదని మండిపడ్డారు. దత్తపుత్రుడు అని మాట్లాడుతుంటే ఊరుకోవద్దంటూ జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. ఇటీవల పవన్నుర చంద్రబాబు దత్తపుత్రుడంటూ సీఎం జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే.  సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్గాు పవన్ స్టేట్మెంపట్ ఇచ్చారు.  పాలసీలపై తప్ప వ్యక్తిగత అంశాలపై తాను మాట్లాడనన్నారు. తన వ్యక్తిగత విషయాలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, నేను రాయల్ ఫ్యామిలీలో నుంచి రాలేదని స్పష్టం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల చదువులు తాను తీసుకుంటానని ప్రకటించారు. తాము కౌలు రైతుల ఆత్మహత్యలపై స్పందించిన తర్వాత ప్రభుత్వం ఆర్భాటంగా వారికి ఏడు లక్షల పరిహారం అందించిందని, ఇదేదో ముందే చేసి ఉంటే అందరికీ సంతోషంగా ఉండేదని సూచించారు. ప్రతి రైతుకూ పరిహారం అందే వరకు జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతుల కోసం తాము యాత్ర చేస్తుంటే మైలేజ్ వస్తుందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

Exit mobile version