Pumpkin Seeds: ఇంట ముఖద్వారానికి వేలాడదీసే గుమ్మడికాయ మానవ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయ పలు వంటకాలకు, ముఖ్యంగా గుమ్మడి కాయ ఒడియాల ప్రత్యేకత అని చెప్పవచ్చు. అటువంటి ఈ గుమ్మడి విత్తనాలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుస్తుంది.. మరి ఈ విత్తనాలు తీసుకోవడం వల్ల పురుషులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలలో ఎక్కువగా నిల్వ ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తపోటును కూడా కొంత వరకు అదుపులో ఉంచుతుంది. ఇక రక్తంలో షుగర్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ గింజలలో ఎక్కువగా ఉండే జింక్ ఇది పురుషులలో వీర్య సాంద్రత పెంచడానికి సహాయపడుతుంది.
అంతే కాకుండా సంతానోత్పత్తి కూడా పెంచుతుంది. పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని పెంచడానికి అవసరమయ్యే పోషకాలన్నీ ఈ గుమ్మడి కాయ గింజలలో ఉన్నాయి. గుమ్మడికాయ గింజలు ప్రోస్టేట్ గ్రంధిని మెరుగుపరచడానికి తమ వంతు సహాయం చేస్తాయి. పురుషులలో ఆరోగ్యమైన హార్మోన్స్ చర్యను మరింత ప్రోత్సహిస్తాయి. ఈ గుమ్మడి గింజల్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణం మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
గుమ్మడికాయ విత్తనాలలో ఇమిడివున్న జింక్ ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఈ గుమ్మడికాయ గింజలు జీవక్రియను మెరుగుపరిచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా అజీర్ణం నివారించడంలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఈ గుమ్మడి కాయను అధిక మొత్తంలో తీసుకోవడం కూడా అంత మంచిది కాదు అని తెలుస్తుంది.