ఈ సృష్టిలో చాలా అద్బుతాలు ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి. వాస్తవానికి గొంతు, మాట్లాడడం అనేది కేవలం మానవులకు మాత్రమే తెలిసిన పని. అయితే కొన్నేళ్ల తరువాత పాటను సృష్టించాడు. సహజ సిద్ధంగా కేవలం కోయలకు మాత్రమే అబ్బిన ఈ విద్యను అనంతర కాలంలో మనిషి కూడా నేర్చుకున్నాడు. దీంతో పాటలు పాడడం అలవాటు చేసుకున్నాడు. అయితే మనిషి నుంచి పక్షులు కూడా కొన్ని మాటలు నేర్చుకున్నాయి. ముఖ్యంగా రామ చిలుక అయితే మనిషి చెప్పిన మాటలను కచ్చితంగా అలానే ఉచ్ఛరిస్తుంది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే మీ ఎప్పుడు అయినా ఓ కుక్క పాట పాడడం విన్నారా?
అవునండి.. కేవలం కోయిలకు, మనిషికి మాత్రమే సాధ్యం అయ్యే ఈ విద్యను ఓ కుక్క కూడా నేర్చుకుంది. ఏకంగా తన పక్కను వ్యక్తి రాగాలు తీస్తే తాను కూడా ఎక్కడా తక్కువ కాను అంటుంది. ఈ క్రమంలోనే అతడ్ని అనుసరిస్తూ పాటలు పాడుతుంది. నిజం చెప్పాలి అంటే అనుకరించే వ్యక్తిని మించి ఆ కుక్క పాట పాడుతుంది. ఇంతకీ ఇది ఎలా సాధ్యం అయ్యింది అని చాలా మంది సందేహాపడుతున్నారు.
కుక్క పాట పాడటం ఎప్పుడైనా విన్నారా..#Viralvideo pic.twitter.com/0mCHgVNq9d
— Asianetnews Telugu (@AsianetNewsTL) August 4, 2020
ఈ కుక్క పాట పాడడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ కుక్క పాట పాడింది ఎక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలోనే ఈ అద్భుతం జరిగింది. ముంబయి కు చెందిని రోహిత్ అనే వ్యక్తి ఈ కుక్కకు యజమాని.. ఆయన పాట పాడుతుంటే ఆ కుక్క కూడా పాటు పాట పాడింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.