పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన అనుభూతి. దీనిని చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటారు. అదే ప్రేమ పెళ్లి అయితే ధూం ధాం చేయాలని అనుకుంటారు. ఇదే క్రమంలో ప్రేమించిన అమ్మాయికి తన వంతుగా గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తారు. ఇప్పుడు ఉన్న యువత అయితే ఆ గిప్టుల కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడడం లేదు. కాబోయే ఫియాన్సీకి సర్ప్రైజ్ గిఫ్టులివ్వడమే పనిగా ముందుకు సాగుతారు. అలానే ఆ గిప్ట్ లను పెద్ద మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారు. అయితే గుజరాత్ లో ఉండే ఓ వ్యక్తి తనకు కాబోయే ఫియాన్సీకి ఇచ్చిన గిప్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు అంటే… ఓ అమ్మాయిని సుమారు రేండేళ్ల నుంచి ప్రేమించాడు. అయితే ఆ మ్మాయి కూడా ఓ కుర్రాడికి ఓకే చెప్పింది . ఇదే సమయంలో వాళ్ల ఇంట్లో వారికి చెప్పగా వారు కూడా వారి పెళ్లికి ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్న తరువాత ఆ యువకుడు విన్నూత్నంగా ఆలోచించి తన భార్యకు ఏకంగా చంద్రుడి మీద స్థలం కొన్నాడు. ఇందుకు ఆలోచన వచ్చిన వెంటనే ఇంటర్నేషనల్ లూనార్ లాండ్ రిజిస్ట్రి అండ్ యూఎస్బెస్డ్ ఆర్గనైజేషన్ అధికారులను సంప్రదించి ఇత్యాది వ్యవహారాలు అన్నీ పూర్తి చేశాడు.
అనంతరం ఇందుకు సంబంధించిన దస్తావీజులను తాళి కట్టిన శుభ వేళలో భార్యకు అందించాడు. ఇది చూసిన ఆమె ఆనంద భాష్పాలను కళ్ల నింపుకుని భర్తను హగ్ చేసుకుంది. ఈ విధంగా ఆ యువకుడు తన ప్రేమను తన భార్యకు చూపించాడు. ఇలాంటి ఆలోచనలు చేసిన వ్యక్తి ఎవరు అనే సందేహం రావచ్చు కదా… ఆ కుర్రాడే గుజరాత్లోని వడోదరకు చెందిన మయుర్ పాటిల్. చంద్రునిపై ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించింది ఆయన భార్య హేమలీ పాటేల్ కోసం. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.