Site icon 123Nellore

పాకిస్థాన్​లో ఎగిరే పళ్లెం కలకలం… గ్రహాంతర వాసులు వచ్చేస్తున్నారా?

పాకిస్థాన్‌‌ లోని ప్రధాన నగరం అయిన ఇస్లామాబాద్‌లోని ఓ వింత ఆకారం ఆకాశంలో కనిపించింది. దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. సాధారణంగా గ్రహాంతర వాసులు వచ్చేలా ఎగిరే పళ్లం వారి కంటికి కనిపించింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారాయి. వీటిని ఈ ఎగిరే పళ్లెంకు సంబంధించిన ఫోటోలను వీడియోలను బర్మింగ్‌హామ్ లోని ఓ బడా బిజినెస్​ మ్యాన్ తన ఫోన్ ద్వారా బంధించాడు. అంతేకాకుండా వాటిని తీసిన అనంతరం సోషల్ మీడియాలో ఉంచాడు.

UFO sighting in Pakistan? Mysterious flying object hovers over Islamabad for 2 hours

ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆ వస్తువు ఎగిరే పళ్లెం అని అంటున్నారు. పక్షులు, డ్రోన్ల మాదిరిగా అది కనిపించలేదని చెప్తున్నారు. అయితే ఈ వీడియోను చూసిన చాలా మంది పాకిస్థాన్​ ప్రజలు ఒక్కసారిగా అందోళనకు గురయ్యారు. ఈ ఎగిరే పళ్లెం సుమారు 2 గంటల పాటు వారికి కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ వస్తువును పరిశీలించేందుకు కొంతమంది డ్రోన్ కెమోరాలను కూడా ఉపయోగించి చూశారు. వారు చూసిన దాని ప్రకారం ఆ వస్తువు పూర్తిగా నల్లగా ఉన్నట్లు వారికి కనిపించింది. అంతేగాకుండా అది త్రిభుజం ఆకారంలో ఉన్నట్లు పలువులు తెలిపారు.

అయితే ఈ ఎగిరే పళ్లానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్లు చేశారు. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. గ్రహాంతర వాసులు వచ్చేస్తున్నారని అంటున్నారు.

Exit mobile version