Late Morning: ప్రస్తుత కాలంలో యువత స్మార్ట్ వర్క్ కి అలవాటుపడి సరిగా ఒంటికి అలసట లేక రాత్రిపూట నిద్ర లేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్స్ కి అలవాటు పడ్డారు. కొందరికి ఈ స్మార్ట్ ఫోనే తినే అన్నం.. తాగే నీరు అవుతుంది. చాలామంది స్మార్ట్ ఫోన్ మైకంలో పడి నైట్ అవుట్ లు చేస్తున్నారు.
ఈ క్రమంలో నిద్రని కూడా మరచిపోతున్నారు. అలా ఆలస్యంగా నిద్ర పోయి ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం జరుగుతుంది. ఇలా ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల పూర్తిగా వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణుల ద్వారా తెలుస్తుంది. ఇదే తరుణంలో యువత ఎక్కువగా అలసి పోయినప్పుడు వారికి ఏదైనా తీపి వస్తువును తినాలనే కోరిక పుడుతుంది.
అందువల్ల చక్కెర కలిగిన పదార్థాలను ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు. ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి హానికరం అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని తినడం వల్ల అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతాయి. దీనివల్ల శరీర బరువు అధికంగా పెరుగుతుంది.
అంతే కాకుండా గుండె రక్తప్రసరణ వ్యవస్థలలో ఆటంకాలు చోటుచేసుకుని గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోజులో తొమ్మిది నుంచి పదకొండు గంటలు నిద్రపోయే వారిలో దాదాపు 40 శాతం గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకని త్వరగా నిద్ర పోయి త్వరగా మేలుకోవడం మన శరీరానికి చాలా మంచిది.