ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువతులు స్కూటీ లను కొనుగోలు చేసి వారి అవసరానికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఒక యువతి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తూ ప్రతిరోజుర్సు
జనక్‌పురి నుండి నోయిడా వరకు ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణిస్తుంది.ఇలా ఇంత దూరం ప్రయాణం చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండటం వల్ల ఆ యువతి ఒక స్కూటీ కొనుగోలు చేసింది. స్కూటీలో వెళ్లి రావడం వల్ల తనకు సమయం ఎంతో ఆదా అవుతుందని భావించితన తల్లిదండ్రులను స్కూటీ అడగడంతో ఆ తల్లిదండ్రులు తన పుట్టినరోజు సందర్భంగా తనకు స్కూటీని బహుమతిగా కొనిచ్చారు.
ఇక ఈ విషయం గురించి తన తండ్రి ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తూ తన బండి నెంబర్ ప్లేట్ మార్చాలని సూచించారు. ఈ క్రమంలోనే అధికారులు ఢిల్లీలో `SEX` సిరీస్ నుంచి మొత్తం పదివేల వాహనాలకు నెంబర్ ప్లేట్ లో కేటాయించామని ఇది పెద్ద విషయం కాదని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్కూటీకి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.